80 శాతం డిస్కౌంట్‌తో యూఏఈలో బిగ్గెస్ట్‌ సేల్‌

- December 30, 2017 , by Maagulf
80 శాతం డిస్కౌంట్‌తో యూఏఈలో బిగ్గెస్ట్‌ సేల్‌

2018 జనవరి 1 నుంచి వ్యాట్‌ అమల్లోకి రానున్న నేపథ్యంలో 'ప్రీ వ్యాట్‌' సేల్స్‌ ఊపందుకుంటున్నాయి. బిగ్గెస్ట్‌ వింటర్‌ క్లియరెన్స్‌ సేల్‌లో బాగంగా షార్జా ఎక్స్‌పో సెంటర్‌ వద్ద 'ఫెయిర్‌' నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌ 31తో ముగియనున్న ఈ ఫెయిర్‌లో, 80 శాతం వరకు డిస్కౌంట్‌తో ఆయా ఉత్పత్తులు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్‌, ఎలక్ట్రానిక్స్‌, హోమ్‌ అప్లయెన్సెస్‌ వినియోగదారుల కోసం భారీ ఆఫర్లతో ఎదురుచూస్తున్నాయిక్కడ. జనవరి 1 నుంచి ఐదు శాతం 'లెవీ' ఆయా వస్తువులపై అదనంగా చెల్లించాల్సి ఉన్నందున, ఈ అద్భుతమైన ఆఫర్‌ని డిసెంబర్‌ 31లోపు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ సేల్‌ అందుబాటులో ఉంటుంది. ఐదు దిర్హామ్‌లు ఎంట్రీ ఫీజ్‌. 12 ఏళ్ళ లోపు చిన్నారులకు ఎంట్రీ ఫ్రీ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com