కూలిన సీ ప్లేన్, ఆరుగురి మృతి
- December 31, 2017
సిడ్నీ నదిలో ఆదివారం నాడు ఒక సీప్లేన్ కూలిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. నగరంలో జరుగుతున్న నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా 'వైన్ అండ్ డైన్' అనే ఈ సీ ప్లేన్లో వీరు నగర విహారానికి బయల్దేరారు. ఈ ప్రమాదానికి కారణం కానీ, అందులో మరణించిన ఐదుగురి వివరాలు కానీ తమకు తెలియదని పోలీసులు చెప్పారు. మృతులలో ఆరో వ్యక్తి ఆ విమాన పైలట్ కావటం విశేషం. కాగా మృతులలో నలుగురు బ్రిటన్ జాతీయులని ఆస్ట్రేలియన్ మీడియా తన వార్తా కథనాలలో వెల్లడించినప్పటికీ పోలీసులు మాత్రం దీనిని ధృవీకరించలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా తాము లండన్లోని విదేశీ వ్యవహారాల అధికారులను సంప్రదిస్తున్నట్లు సిడ్నీలోని స్థానిక అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







