పుట్టినరోజు వేడుకల అనంతరం ఆత్మహత్య

- January 03, 2018 , by Maagulf
పుట్టినరోజు వేడుకల అనంతరం ఆత్మహత్య

దుబాయ్:ఆసియాకి చెందిన 28 ఏళ్ళ వ్యక్తి ఒకరు, తన రూమ్‌లో సీలింగ్‌ ఫ్యాన్‌కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొత్త సంవత్సరం తొలి రోజున, అదీ తన పుట్టినరోజు వేడుకల్ని అదే రోజు జరుపుకున్న అనంతరం ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం అందర్నీ కలచివేస్తోంది. 1990 జనవరి 1న ఆ వ్యక్తి జన్మించాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు దుబాయ్‌ పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. దుబాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ అబ్దుల్లా ఖాదెమ్‌ బిన్‌ సర్రోర్‌ మాట్లాడుతూ, జనవరి 1న తెల్లవారు ఝామున 2 గంటల సమయంలో తమకు సమాచారం అందిందనీ, వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళగా ఓ యువకుడు మృతి చెంది కన్పించాడని అన్నారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా చితికిపోయాడని ఆయన సన్నిహితులు పోలీసులకు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com