సౌదీలో 3 లక్షల 37 వేల మంది అక్రమ నివాసితులు అరెస్ట్ !
- January 05, 2018
రియాద్ : ' ఉంటే ..ఈ ఊర్లో ఉండు...లేదంటే , నీ దేశం పోరా ' అయితే సౌదీ అరేబియా దేశంలో ఉండాలంటే సక్రమ అనుమతి ఖచ్చితంగా ఉండాలి. దాంతో అక్రమ నివాసితులపై సౌదీఅరేబియా కఠినమైన చర్యలు తీసుకోనుంది . అక్రమంగా నివాసముంటున్నవారికి దెస బహిష్కరణ విధించనున్నారు. పలు ప్రాంతాలలో తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకూ 3,37,281 మందిని అదుపులోనికి తీసుకొన్నారు.. వీరివద్ద సరైన నివాస అనుమతిలేని కారణంగా 1,98,231 మందిని , పని అనుమతి లేని 99,000 మంది అరెస్టైన వారిలో ఉన్నారు. నవంబర్ 15న ప్రారంభమైన ఈ చర్యల్లో భాగంగా అక్రమంగా నివసిస్తూ పట్టుబడ్డ 65,715 మంది వలసజీవులను స్వదేశాలకు పంపించేశారు. వీరిలో అధికంగా యెమన్, ఇథియోపియా, ఆఫ్రికన్ దేశాలకు చెందినవారు ఉన్నారు. ఇదిలావుండగా సౌదీలో అక్రమంగా నివసిస్తున్నవారు ఎలాంటి జరిమానా చెల్లించకుండా వెళ్లిపోవచ్చునని గతేడాది మార్చిలో సౌదీలో ప్రకటించింది. ప్రస్తుతం అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన వారికి 15,000 నుంచి 1,00,000 రియాల్స్ జరిమానా విధిస్తున్నారు. చెల్లించిన అనంతరం స్వదేశాలకు పంపిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు