స్పెషల్‌ యూనిఫైడ్‌ మిలిటరీ కోర్ట్‌ కోసం బిల్లు

- January 08, 2018 , by Maagulf
స్పెషల్‌ యూనిఫైడ్‌ మిలిటరీ కోర్ట్‌ కోసం బిల్లు

మనామా: యూనిఫైడ్‌ మిలిటరీ కోర్టు కోసం పార్లమెంటేరియన్లు బిల్లు రూపొందించి, దానిపై చర్చించనున్నారు. కింగ్‌డమ్‌లో పోలీసుల కోసం ఈ కోర్టును ఏర్పాటు చేయతలపెట్టారు. ఫారిన్‌ ఎఫైర్స్‌, డిఫెన్స్‌ మరియు నేషనల్‌ సెక్యూరిటీ కమిటీ అప్రూవ్‌ చేసిన ఈ బిల్లు హౌస్‌ ఆఫ్‌ రిప్రెజెంటేటివ్స్‌ అనుమతి పొందింది. ఎంపీ ఖాలిద్‌ అల్‌ షాయిర్‌ ఈ బిల్లుని సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందడానికి ఆర్టికల్‌ 82-89 - పబ్లిక్‌ సెక్యూరిటీ ఫోర్సెస్‌ చట్టాన్ని సవరించవలసి ఉంటుంది. ఈ వారంలో రెగ్యులర్‌ సెషన్‌ సందర్భంగా బిల్లు చర్చకు రానున్నట్లు ఎంపీ అల్‌ షయీర్‌ చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com