స్టోర్‌లో అగ్ని ప్రమాదం

- January 08, 2018 , by Maagulf
స్టోర్‌లో అగ్ని ప్రమాదం

మస్కట్‌: ఘలా ఇండస్ట్రియల్‌ ఏరియాలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ స్టోర్‌ పూర్తిగా తగలబడిపోయింది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. సమాచారం అందగానే పిఎసిడిఎ టీమ్స్‌ సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేశాయని చెప్పారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. ఫైర్‌ ఫైటర్స్‌ సమర్థవంతంగా పనిచేసి, మంటల్ని అదుపు చేసినట్లు పిఎసిడిఎ అధికారులు చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com