భాగ్యనగరం IT రోడ్లకు మహర్దశ

- January 09, 2018 , by Maagulf
భాగ్యనగరం IT రోడ్లకు మహర్దశ

హైదరాబాద్:హైదరాబాద్ IT కారిడార్ ప్రాంతంలోని రోడ్లకు మహర్దశ  పట్టనుంది. ట్రాఫిక్‌ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని  హైదరాబాద్‌ యూనివర్శిటీ నుంచి వట్టి నాగులపల్లి మార్గంలో 152 కోట్ల రూపాయలతో రోడ్ల విస్తరణ పనులకు.. నల్లగండ్లలో మంత్రి KTR శంకుస్థాపన చేసారు.. 

ప్రస్తుతం ఉన్న 40 అడుగుల ఇరుకు రోడ్లను 100 అడుగుల వరకు విస్తరించనున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వట్టి నాగులపల్లి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు.. 12 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమం లో  KTR తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, మహేందర్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గాంధీ.. ఇతర అధికారులు పాల్గొన్నారు.. 

159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి అయ్యిందని, కొత్తగా 35 రేడియల్ రోడ్ల పనులు జరుగుతున్నాయని  మంత్రి అన్నారు.  ORR లోపల 350 కిలో మీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.. 

రిజినల్ రోడ్లుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా లభించిందని ,భాగ్యనగరాన్ని విశ్వనగరంగా చేసేందుకు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారరన్నారు మంత్రి తుమ్మల.. 

రేడియల్ రోడ్స్ పూర్తయితే హైటెక్‌ సిటీ అందం ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది.. శంకుస్థాపన చేసి వదిలేయకుండా.. అనుకున్న సమయానికి రేడియల్ రోడ్స్ త్వరగా నిర్మిస్తే.. ఐటి కూడా  ఇంకాస్త అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.. దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందుండడం ఖాయం..

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com