షార్జా వేర్‌హౌస్ దగ్ధం: భారీగా ఆస్తి నష్టం
- January 10, 2018
షార్జా:ఓ వేర్‌హౌస్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. న్యూ ఇండస్ట్రియల్ ఏరియాలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. షార్జా సివిల్ డిఫెన్స్ ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే, సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని ఆర్పివేసేందుకు ప్రయత్నించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్ అజీజ్ అల్ షమ్షి మాట్లాడుతూ, తెల్లవారుఝామున 1.50 నిమిషాల సమయంలో ఈ ఘటనపై తమకు సమాచారం అందిందనీ, సంఘటనా స్థలానికి కేవలం 4 నిమిషాల్లోపే చేరుకుని, సహాయక చర్యలు ముమ్మరం చేశామని అన్నారు. 30 నిమిషాల్లో మంటల్ని ఆర్పివేయడం జరిగిందని చెప్పారాయన. పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి సివిల్ డిఫెన్స్, ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తుందని ఆయన తెలిపారు. వేర్‌హౌస్‌లు మరియు ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నిర్వాహకులు భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా అల్ షమ్షి విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







