దావోస్ సదస్సులో షారుఖ్ ఖాన్ కు క్రిస్టల్ అవార్డు
- January 11, 2018
జెనీవా: దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో బాలీవుడ్ హీరో షారుఖ్‌ఖాన్ అరుదైన గుర్తింపు దక్కనుంది. సదస్సు సందర్భంగా ఈ నెల 22వ తేదీన హాలీవుడ్ హీరోయిన్ కేట్ బ్లాంచెట్, ప్రఖ్యాత గాయకుడు ఎల్టన్ జాన్‌తోపాటు షారుఖ్ క్రిస్టల్ అవార్డు అందుకోనున్నారు. షారుఖ్ ఖాన్ గత 30 ఏళ్లుగా భారతీయ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని డబ్ల్యూఈఎఫ్ తన ప్రకటనలో పేర్కొంది.
దేశంలో స్త్రీలు, పిల్లల హక్కుల ఆయన సాగిస్తున్న పోరాటానికి ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపింది. యాసిడ్ దాడి, అగ్ని ప్రమాద బాధితులను ఆదుకునేందుకు మీర్ ఫౌండేషన్‌ను నడుపుతున్నారని, కేన్సర్ బాధిత చిన్నారులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నారని వివరించింది. గతంలో ఈ అవార్డును అందుకున్న ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, మల్లికా సారాభాయ్, ఏఆర్ రెహమాన్, షబానా అజ్మి తదితరులున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







