కువైట్ కు భారతదేశ నూతన రాయబారిగా కె. జీవసాగర్ బాధ్యతలు స్వీకరణ
- January 12, 2018
కువైట్ : మన తెలుగుతేజం కె .జీవసాగర్ కువైట్ లో భారతదేశ నూతన రాయబారిగా ఉద్యోగ బాధ్యతలు శుక్రవారం స్వీకరించారు. ఆయనను కువైట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు విదేశాంగ మంత్రి షేక్ సబాహ్ అల్-ఖలేద్ అల్ హమద్ అల్ సబాహా సాదరంగా ఆహ్వానించారు. షేక్ సబాహ్ అల్-ఖలేద్ నూతన రాయబారి జీవసాగర్ కు శుభాకాంక్షలు తెలియచేసి కొత్త విధిలో అదృష్టం వెన్నెంటే ఉండాలని అభిలషించారు. ,కువైట్ - భారతదేశం మధ్య స్నేహపూర్వక వాతావరణం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. ఉప విదేశాంగ మంత్రి ఖలీద్ అల్-జరల్లా, ప్రోటోకాల్స్ సహాయ మంత్రి ధరి అల్-అజ్రాన్, ఉప ప్రధాన మంత్రి మరియు విదేశాంగ మంత్రి కార్యదర్శి కార్యదర్శి శాలెహ్ అల్-లుఘాని మరియు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మరియు విదేశాంగ మంత్రిత్వశాఖలోని అనేక ఇతర సీనియర్ అధికారులు నూతన భారత రాయబారికి ఆహ్వానం పలికినవారిలో ఉన్నారు. కె. జీవసాగర్ ఆంధ్రప్రదేశ్లోని మచిలిపట్నం ( బందరు) నోబుల్ కాలనీ వాస్తవ్యుడైన ఆయన నోబుల్ కళాశాల పూర్వ విద్యార్థి . కె . జీవసాగర్ 1991 బ్యాచ్ కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. కువైట్లో చేరేముందు, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెస్ట్ ఆసియా (ఇరాన్), యూరప్ (ఐర్లాండ్), దక్షిణ ఆఫ్రికా (జింబాబ్వే), లాటిన్ అమెరికా (మెక్సికో) మరియు తూర్పు ఆసియా (దక్షిణ కొరియా) సియోల్ లో ఇండియన్ మిషన్ యొక్క డిప్యూటీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత, శ్రీ సాగర్ భారతదేశ హై కమిషనర్ గా ఘనా దేశానికి 17 జూన్ 2013 న బాధ్యతలు స్వీకరించాడు. టోగో, బుర్కినా ఫాసో మరియు సియెర్రా లియోన్లకు ఆయన సమర్ధుడైన అధికారిగా ఏకకాలంలో గుర్తింపు పొందాడు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







