జనవరి 18 నుంచి మస్కట్‌ ఫెస్టివల్‌

- January 13, 2018 , by Maagulf
జనవరి 18 నుంచి మస్కట్‌ ఫెస్టివల్‌

మస్కట్‌: సుల్తానేట్‌లో యాన్యువల్‌ మస్కట్‌ ఫెస్టివల్‌కి సర్వం సిద్ధమవుతోంది. జనవరి 18 నుంచి ప్రారంభమయ్యే ఈ అద్భుతమైన ఈవెంట్‌లో రెసిడెంట్స్‌, సిటిజన్స్‌ అలాగే టూరిస్టులకు అనేక రకాలైన కార్యక్రమాలు ఈ ఫెస్టివల్‌లో స్వాగతం పలకనున్నాయి. అల్‌ నసీమ్‌ పబ్లిక్‌ పార్క్‌, అల్‌ అమెరాత్‌ పబ్లిక్‌ పార్క్‌లో ఎక్కువగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ కార్యక్రమాలుంటాయి. వీకెండ్స్‌లో అర్థరాత్రి వరకు ఈవెంట్స్‌ని నిర్వహిస్తారు. థియేటర్‌ ప్లేస్‌, మ్యూజికల్‌ పెర్ఫామెన్సెస్‌, చైనీస్‌ ల్యుమినస్‌ డైనోసార్‌ షో ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. క్లాసిక్‌ కార్స్‌ వంటివి సందర్శకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com