స్కూల్‌లో అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి

- January 13, 2018 , by Maagulf
స్కూల్‌లో అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి

సౌదీ అరేబియా:సౌదీ స్టూడెంట్‌ ఒకరు, అనారోగ్యంతో కన్నుమూసిన ఘటన అందర్నీ కలచివేసింది. క్లాస్‌లో ఎగ్జామ్‌ రాస్తున్న సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన అతన్ని ఇంటికి తరలించారు. అయితే అతని ప్రాణాల్ని మాత్రం కాపాడలేకపోయారు. మృతుడు మౌత్‌ ముస్లిమ్‌ సలౌమ్‌ అల్‌ అవ్‌ఫి, కౌస్‌ బిన్‌ సాద్‌ అల్‌ అన్సారీ స్కూల్‌ (మదీనాలో) విద్యనభ్యసిస్తున్నాడు. అల్‌ అరేబియా వెల్లడించిన వివరాల ప్రకారం మృతుడిది సహజ మరణమేనని తెలియవస్తోంది. మెరిట్‌ స్టూడెంట్‌ అయిన అల్‌ అవ్‌ఫి మృతి చెందడం పట్ల స్కూలు యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తమ బిడ్డ మృతితో అతని తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. తల్లిదండ్రులు, సన్నిహితులు, స్కూల్‌ ప్రిన్సిపల్‌ సైతం విద్యార్థి ఎలాంటి అనారోగ్యానికీ గురి కాలేదనీ, ఎలా చనిపోయాడో తమకి అర్థం కావడంలేదని చెబుతున్నారు. అలసిపోయినట్లుగా చెప్పడంతో వెంటనే పారామెడిక్స్‌ని రప్పించామనీ, పరీక్ష రాస్తున్న సమయంలో తీవ్ర ఇబ్బందికి గురి కావడంతో ఇంటికి కారుని ఏర్పాటు చేశామనీ, దురదృష్టవశాత్తూ అతను చనిపోయాడని స్కూల్‌ ప్రిన్సిపల్‌ మహాల్‌ అల్‌ అవ్‌ఫి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com