మోసం చేసే అక్రమ ఏజెంట్లపై కఠిన చర్యలు:కెటిఆర్
- January 13, 2018
హైదరాబాద్: విదేశాలకు పంపిస్తామని చెప్పి అమాయకుల్ని మోసం చేసే అక్రమ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు మంత్రులు కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈ-మైగ్రేట్‌లో రిజిస్టర్ చేసుకునేందుకు ఏజెంట్లకు నెల రోజుల సమయం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ లోగా నమోదు చేసుకోకపోతే వారందరిని అక్రమ ఏజెంట్లుగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రిజిస్టర్ చేసుకోని అక్రమ ఏజెంట్లపై కేసులు నమోదు చేయడంతోపాటు పదే పదే అక్రమాలకు పాల్పడుతున్న ఏజెంట్లుపై పీడీ చట్టం పెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నారై శాఖపై శనివారం మంత్రులు కేటీఆర్, నాయిని సమీక్షించారు. అక్రమ ఏజెంట్లపై చర్యలు తీసుకునే విషయంలో పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. హైదరాబాద్ నగరంలో విదేశీ భవన్‌కు ఫిబ్రవరి రెండో వారంతో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చర్యలు తీసుకోవాలని అధికారులతో అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నారైలు వలస కార్మికుల కోసం చేపడుతున్న చర్యలు, ప్రభుత్వ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలన్నారు. గల్ఫ్‌కు మహిళల అక్రమ రవాణాపైన మరింత కఠినంగా వ్యవహారించాలని పోలీసు శాఖను అదేశించారు.
ఈ విషయంలో మైనార్టీ సంక్షేమ, కార్మిక, ఎన్నారై, పోలీసు శాఖలు ఉమ్మడి బృందాల ఏర్పాటు చేయాలని మంత్రులు ఆదేశించారు
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







