2019లో ఒమన్ తొలి శాటిలైట్ లాంచ్
- January 15, 2018
మస్కట్: ఒమన్ తొలి శాటిలైట్ అంతరిక్ష్యంలోకి 2019లో పంపనున్నారు. లైట్ పొల్యూషన్‌ని గుర్తించడం ఈ శాటిలైట్ ఉద్దేశ్యం. ఒమన్ ఆస్ట్రనామికల్ సొసైటీ (ఓఎఎస్)కి ఇది అత్యంత కీలకమైన ప్రయోగంగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్స్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇతర మంత్రిత్వ శాఖలు ఈ ప్రాజెక్ట్‌లో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఓఎఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ సలెహ్ బిన్ సైద్ అల్ షెతాని మాట్లాడుతూ, శాటిలైట్‌ని బేసిక్ మోడల్ (క్యూబ్ శాటిలైట్ లేదా క్యూబ్‌శాట్) అని తెలిపారు. శాటిలైట్ నిర్మాణ దశలో ఉందని డాక్టర్ సలెహ్ చెప్పారు. 2019లో శాటిలైట్ లాంఛ్ జరుగుతుందనీ, తేదీ విషయమై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వివరించారు. క్యూబ్ వాట్ బరువు 1.33 కిలోలు ఉంటుందనీ 10-10-10 సెంటీమీటర్ల క్యూబిక్ యూనిట్స్‌తో దీన్ని నిర్మించనున్నామని డాక్టర్ సలెహ్ తెలిపారు.
తాజా వార్తలు
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!







