సల్మానియా సిగ్నల్-జంక్షన్ వద్ద మూడురోజుల పాటు దారి మూసివేత

- January 16, 2018 , by Maagulf
సల్మానియా  సిగ్నల్-జంక్షన్ వద్ద మూడురోజుల పాటు దారి మూసివేత

మనామా: సల్మానియా మరియు కింగ్ అబ్దులాజిజ్ ప్రాంతాల సిగ్నల్-జంక్షన్ వద్ద ఒక ప్రాముఖ్యమైన ఉపరితల పనులను అమలు చేయనున్నట్లు పనులు మరియు పురపాలక వ్యవహారాల మంత్రిత్వశాఖ మరియు పట్టాన ప్రణాళిక శాఖ మంగళవారం ప్రకటించింది. ఆ నేపథ్యంలో ఒక మార్గ దశలో దారి మూసివేయబడుతుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎటువంటి ఆటంకం లేకుండా ట్రాఫిక్ కొనసాగింపు కోసం మరొక మార్గంలో దారి తెరవబడుతుందని మంత్రిత్వశాఖ సూచించింది. ఆ మార్గం మూసివేత గురువారం జనవరి 18 వ తేదీ రాత్రి 11:00 గంటల నుంచి ఆదివారం జనవరి 21 వ తేదీ ఉదయం 5 గంటల వరకు   సమర్థవంతంగా అమలు చేయబడనుంది.ఆ ప్రాంతంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని భద్రతా కారణాల దృష్ట్యా ట్రాఫిక్ నియమాలను గమనించి, అనుసరించాలని అందరు రహదారి వినియోగదారులను మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com