టర్కీ 'ఆపరేషన్‌ ఆలివ్‌బ్రాంచ్‌'

- January 21, 2018 , by Maagulf
టర్కీ 'ఆపరేషన్‌ ఆలివ్‌బ్రాంచ్‌'

సిరియాలోని ఆఫ్రిన్‌ ప్రావిన్స్‌ నుండి కుర్దిష్‌ మిలీషియాను తిరిమి కొట్టేందుకు 'ఆపరేషన్‌ ఆలివ్‌ బ్రాంచ్‌' పేరిట సైనిక చర్యను ప్రారంభించినట్లు టర్కీ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సైనిక చర్య స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రారంభించినట్లు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. టర్కీకి చెందిన ఎఫ్‌ా16 యుద్ధ విమానాలు సిరియా భూభాగం లోపల కొన్ని కి.మీ ప్రాంతంలో బాంబుల వర్షం కురిపించిన దృశ్యాలను టీవీ ఛానళ్లు తమ వార్తా కథనాలలో ప్రసారం చేశాయి. సిరియా ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకే తాము ఈ సైనిక చర్య చేపట్టినట్లు టర్కీ ఈ ప్రకటనలో వివరించింది. ఆఫ్రిన్‌ ప్రాంతంలో తిష్టవేసిన మొత్తం ఉగ్రవాదులందరినీ తరిమికొట్టేంత వరకూ తమ ఈ ఆపరేషన్‌ కొనసాగుతుందని సైన్యం వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com