సామాన్యుడికి సహాయం అందించిన సౌదీ రాజు
- January 21, 2018
సౌదీఅరేబియా:మనసున్న రాజు మరలా సామాన్యులను ఆదుకున్నారు..గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ఒక కారు యాక్సిడెంట్‌కు గురయింది. ఆ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు.. తల్లి ఆమెతోపాటు ఆరుగురు పిల్లలు చనిపోవడంతో ఆ కుటుంబంలో భర్త మాత్రమే మిగిలాడు. అందరినీ కోల్పోయి అనాథగా మిగిలిన జెడ్డాకు చెందిన సామీ బిన్ మహ్మద్ అలీని సహాయం చేసి ఆదుకుంటామని రాజు ప్రకటించారు. ప్రకటించిన కొద్దిసేపటికే సామి బిన్ మహ్మద్ కి ఒక కారుతోపాటు ఇంటిని బహుమానంగా ఇచ్చారు. అయితే రాజు చేసిన సాయం సామి కుటుంబాన్ని బతికించలేకపోయినా కూడా అతడి బాధను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు