భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఓం ప్రకాశ్ రావత్

- January 21, 2018 , by Maagulf
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఓం ప్రకాశ్ రావత్

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఓం ప్రకాశ్ రావత్ నియమితులయ్యారు. రావత్ ఈ నెల 23న నూతన సీఈసీ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం సీఈసీ గా కొనసాగుతున్న అచల్‌ కుమార్‌ జ్యోతి పదవీ కాలం రేపటితో ముగియనుంది. దాంతో ఆ పదవిని ఓం ప్రకాశ్ రావత్ తో భర్తీ చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1977 ఐఏఎస్ బ్యాచ్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన వారు రావత్. పలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ పదవుల్లో పని చేశారు. కాగా అయన భారీ పరిశ్రమలశాఖ సెక్రటరీగా చేసి ఇటీవల రిటైరయ్యారు. 1993లో రక్షణశాఖలో డైరెక్టర్‌గా విధులు నిర్వహించిన రావత్ ఆ మరుసటి ఏడాది ఐక్యరాజ్యసమితి ఎన్నికలకు పరిశీలకుడిగా పని చేశారు. పలు విభాగాల్లో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ప్రధాన మంత్రి అవార్డు కూడా లభించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com