ఫ్యుజైరా అగ్ని ప్రమాదం: 7 గురు చిన్నారుల మృతి
- January 22, 2018
ఫ్యుజైరా:ఫ్యుజైరాలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం 7 గురు చిన్నారుల్ని బలికొంది. పిల్లలు నివసిస్తోన్న రూమ్‌లోని ఎయిర్ కండిషనర్ నుంచి మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత అవి మిగతా ఇల్లంతా వ్యాపించాయి. తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో వెంటనే ఆ చిన్నారుల తల్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకోగానే రికార్డు సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నా, అప్పటికే 7 గురు చిన్నారులు మృతి చెందారు. వీరిలో నలుగురు అబ్బాయిలు కాగా, ముగ్గురు అమ్మాయిలు. వీరిలో 13 ఏళ్ళ వ్యక్తి అత్యధిక వయసు కాగా, అత్యల్ప వయసు 5 సంవత్సరాలు. ఇంట్లో పొగ వాసన రావడంతో మేల్కొన్న తల్లి, వెళ్ళి చూసేసరికి మంటలు వ్యాపించాయని, పోలీసులకు సమాచారం అందించగానే సంఘటనా స్థలానికి వెళ్ళామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఘటనకు గల కారణాల్ని తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు పోలీసులు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







