ఫ్యుజైరా అగ్ని ప్రమాదం: 7 గురు చిన్నారుల మృతి

- January 22, 2018 , by Maagulf
ఫ్యుజైరా అగ్ని ప్రమాదం: 7 గురు చిన్నారుల మృతి

ఫ్యుజైరా:ఫ్యుజైరాలోని ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం 7 గురు చిన్నారుల్ని బలికొంది. పిల్లలు నివసిస్తోన్న రూమ్‌లోని ఎయిర్‌ కండిషనర్‌ నుంచి మంటలు వ్యాపించాయి. ఆ తర్వాత అవి మిగతా ఇల్లంతా వ్యాపించాయి. తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరగడంతో వెంటనే ఆ చిన్నారుల తల్లి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకోగానే రికార్డు సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్నా, అప్పటికే 7 గురు చిన్నారులు మృతి చెందారు. వీరిలో నలుగురు అబ్బాయిలు కాగా, ముగ్గురు అమ్మాయిలు. వీరిలో 13 ఏళ్ళ వ్యక్తి అత్యధిక వయసు కాగా, అత్యల్ప వయసు 5 సంవత్సరాలు. ఇంట్లో పొగ వాసన రావడంతో మేల్కొన్న తల్లి, వెళ్ళి చూసేసరికి మంటలు వ్యాపించాయని, పోలీసులకు సమాచారం అందించగానే సంఘటనా స్థలానికి వెళ్ళామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఘటనకు గల కారణాల్ని తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు పోలీసులు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com