30 ఏళ్లలోపు ప్రవాసియ గ్రాడ్యుయేట్లను జులై 1 వ తేదీ నుండి ఉద్యోగాలలో ఇక నియమించరు
- January 22, 2018
కువైట్: ఈ ఏడాది జులై 1 వ తేదీ నుండి 30 ఏళ్ల లోపు ప్రవాసియ గ్రాడ్యుయేట్లను ఉద్యోగాలలో నియమించడం లేదని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. యూనివర్శిటీ సర్టిఫికేట్లను కలిగి ఉన్న 30 ఏళ్ళ లోపు వయసు ఉన్న విదేశీయుల నియామకాలను నిలిపివేస్తామని నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఈ నిర్ణయం అమలు చేయాలని భావించారు, కాని సాంఘిక వ్యవహారాల మంత్రి మరియు కార్మిక , ఆర్థిక శాఖ మంత్రి హిందూ అల్-సబీలు ఆరునెలల పాటు వాయిదా వేయాలని కోరారు. ఈ గడువులోపల సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాలని కోరారు. ప్రణాళికా మరియు నైపుణ్యాల డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జులై 1, 2018 నాటికి అధికారంగా నిర్ణయం తీసుకుంటుందని పామ్ డాక్టర్ ముబారక్ అల్-అజ్మీ వద్ద అక్రిడిటేషన్ సెక్టార్ ధృవీకరించింది. ప్రత్యేకించి, ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేయడం కంటే సాంకేతిక అంశాలను క్షుణంగా పరిశీలించి అమలు చేయడం మంచిదని తెలిపింది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక