భావన్స్ జిసిసి స్పెల్ బీలో మెరిసిన 'బిఐఎస్' విద్యార్థులు
- January 22, 2018
భావన్స్ జిసిసి స్పెల్ బీ - గ్రాండ్ పినాలెలో బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ (బిఐఎస్) విద్యార్థులు ప్రతిభ చూపారు. ఇండియన్ ఎడ్యుకేషనల్ స్కూల్, కువైట్ - జనవరి 20న ఈ ఈవెంట్ నిర్వహించింది. బిఐఎస్ ఎడ్యుకేటర్ అర్పితా దత్తా, ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్ ఫ్యాకల్టీ సభ్యులు ఈ కాంపిటీషన్‌ని కో-ఆర్డినేట్ చేశారు. పార్థ్ గుప్తా కేటిరీ 1లో స్పెల్ బీ చాంపియన్‌గా నిలవగా, 50,000 రూపాయలు బహుమతిగా లభించింది. కేటగిరీ2లో మానిని లలిత్ దేశాయ్, కేటగిరీ 3లో స్టీవ్ చలిల్ బిజు విజేతలుగా నిలిచారు. మహిమా సుసాన్ కేటగిరీ 4లో విజయం దక్కించుకున్నారు. ఈ విజయం తల్లిదండ్రులకు, విద్యార్థులకు, బిఐఎస్‌కి ప్రౌడ్ మూమెంట్ అని చెప్పక తప్పదు. బిఐఎస్ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్, కో-ఆర్డినేటర్, టీచర్స్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. హార్డ్ వర్క్‌కి తగిన గుర్తింపు దక్కిందని వారు విద్యార్థుల్ని ఉద్దేశించి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు