ఇక విమానాల్లో వైఫై సేవలు: 30శాతం వరకు ఛార్జీ అదనం!
- January 22, 2018
చెన్నై: విమానంలో ప్రయాణించే వారికి శుభవార్త. ఇకపై దేశీయ విమానయానంలో మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ సేవలను విమానంలో ప్రయాణించే సమయంలోనూ వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీపై ట్రాయ్ సరికొత్త ప్రతిపాదనలను తీసుకొచ్చింది.
భద్రతాపరంగానూ ట్రాయ్ నిబంధనలను రూపకల్పన చేసింది. ట్రాయ్ ప్రతిపాదనల ప్రకారం ఇక నుంచి స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఫ్లైట్ మోడ్‌లో ఉన్నప్పుడు వైఫై ద్వారా ఇంటర్నెట్ వాడుకోవచ్చు.
అయితే, ఇందుకు విమాన టికెట్ ఛార్జీతోపాటు 20-30శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేగాక, మొబైల్ ఫోన్ సేవల్ని మాత్రం విమానం 3వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడే వాడుకోవాలి. ఆ సమయంలోనే టెరిస్ట్రిరియల్ నెట్‌వర్క్‌ను వాడుకోవాలని ట్రాయ్ సూచించింది.
ట్రాయ్ నిబంధనల ప్రకారం.. దేశీయ గగనతలంపై మొబైల్ కమ్యూనికేషన్ ఆన్ ఎయిర్ క్రాఫ్ట్, ఇన్ ఫ్లైట్ కనెక్టివిటీని వాడుకోవచ్చు. అయితే, ఈ సేవలు అందించడం విమానయాన సంస్థల ఇష్టమని ట్రాయ్ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక