ప్లాన్ ప్రకారమే ఖలీఫా టౌన్: గవర్నర్
- January 23, 2018సదరన్ గవర్నర్ షేక్ ఖలీఫా బిన్ అలి అల్ ఖలీఫా మాట్లాడుతూ, ఖలీఫా టౌన్ హౌసింగ్ ప్రాజెక్ట్, బహ్రెయిన్‌లోనే అతి పెద్ద హౌసింగ్ ప్రాజెక్ట్ అని అభివర్ణించారు. ప్లాన్ ప్రకారమే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందనీ, అక్సర్, జావ్ మరియు అల్ దౌర్ ప్రాంతాల్లోని ప్రజల అవసరాల్ని తీర్చేలా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగిందని వివరించారాయన. మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ బస్సిమ్ బిన్ యాకూబ్ అల్ హమార్తో గవర్నర్ భేటీ అయ్యారు. ఖలీఫా టౌన్ హౌసింగ్ ప్లాన్‌కి సంబంధించి పలు అంశాల్ని మినిస్టర్‌తో గవర్నర్ చర్చించారు. ఇరు వర్గాలకు సంబంధించిన అధికారులూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. పౌరుల అవసరాలకు తగ్గట్టుగా హౌసింగ్ మినిస్ట్రీ పనిచేస్తున్న విధానం పట్ల గవర్నర్ హర్సం వ్యక్తం చేశారు. ఖలీఫా టౌన్లో సిటిజన్స్‌కి ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా మినిస్టర్, గవర్నర్ భరోసా ఇచ్చారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు