అభివృద్ధి బాటలో మయన్మార్ శాంతి క్రమం
- January 24, 2018_1516794816.jpg)
యాంగాన్ : మయన్మార్ శాంతి క్రమం పురోగతి బాటలో పయనిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వం అమలుచేస్తున్న కాల్పుల విరమణ ఒప్పందం (ఎన్‌సిఎ)తో చేతులు కలుపుతామంటూ రెండుకు పైగా సాయుధ గ్రూపులు ప్రకటించాయి. మంగళవారం ప్రభుత్వ సలహాదారు ఆంగ్‌సాన్ సూకీ, రక్షణ విభాగ కమాండర్ ఇన్ చీఫ్ మిన్ ఆంగ్ హ్లాయింగ్లతో సమావేశం అనంతరం న్యూ మోన్ స్టేట్ పార్టీ (ఎన్ఎంఎస్పి), లాహు డెమోక్రటిక్ యూనియన్ (ఎల్డియు)లు త్వరలో ఎన్సిఎపై సంతకాలు చేయడానికి అంగీకరించాయి. ఈ మేరకు రెండు పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ రెండు పార్టీల నేతలు యునైటెడ్ నేషనాలిటీస్ ఫెడరల్ కౌన్సిల్ (యుఎన్ఎఫ్సి)లో సభ్యులు. కాల్పుల విరమణయేతర గ్రూపునకు ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తోంది. సమావేశం అనంతరం సూకీ పత్రికల వారితో మాట్లాడుతూ, శాంతి క్రమం దిశగా పురోగతి పట్ల హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు