అమెరికాలో హైదరాబాద్‌వాసి మృతి
- January 24, 2018
హైదరాబాద్: హైదరాబాద్ నగరవాసి యూఎస్‌లో కన్నుమూశాడు. ఐటీ ఉద్యోగి చైతన్యరెడ్డి(36) గుంటుక అనే వ్యక్తి గుండెపోటుకు గురై హుస్టన్ నగరంలో మృతిచెందాడు. సీనియర్ సాఫ్ట్వేర్ క్యూఏ అనలిస్ట్‌గా హుస్టన్‌లోని రాయల్ టెక్నోక్రాట్స్లో చైతన్య పనిచేస్తున్నాడు. యూఎస్‌లో ఐటీ ఉద్యోగిగా అతను పదేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే అతను కంపెనీ మారాడు. హైదరాబాద్‌లోని శ్రీ సత్యసాయి కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నుంచి పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్.. కర్ణాటకలోని గుల్బార్గా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తిచేసిన చైతన్య టెక్సాస్‌లోని లామర్స్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పట్టాను అందుకున్నాడు. అంతిమ సంస్కారాల నిమిత్తం మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు స్థానిక తెలంగాణ సంస్థ మృతుడి కుటుంబ సభ్యులకు సహకారం అందిస్తుంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక