'కల్యాణివేనా? ఏం చేస్తున్నావ్?' అంటూ చంపేస్తున్నారు..!
- January 24, 2018_1516863111.jpg)
ప్రముఖ నటుడు నాగార్జున తనను చాలా ఇబ్బంది పెట్టారని, తన పనికి అంతరాయం కలిగేలా చేయడం వల్ల తాను చాలా నష్టపోయానని, దీనికి పరిహారంగా 50 లక్షల రూపాయలు చెల్లించాలని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వికాస్ ప్రజాపతి కోర్టుకెక్కినట్టు తెలుస్తోంది. అదేంటీ జార్ఖండ్ కి చెందిన వ్యక్తితో నాగార్జున కు ఉన్న సంబంధం ఏంటీ..ఎందుకు విసిగించారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి..! అసలు విషయానికి వస్తే..ఈ మద్య అక్కినేని అబ్బాయి అఖిల్ 'హలో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇది అఖిల్ రెండవ సినిమా..మొదటి సినిమా వివివినాయక్ దర్శకత్వంలో 'అఖిల్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఈ సినిమా అనుకున్న విజయం సాధించలేదు. ఆ తర్వాత మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇదలా ఉంటే..ఇప్పుడు ఈ సినిమాపై మరో సెస్సేషన్ టాక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో అక్కినేని అఖిల్ హీరోగా విడుదలైన 'హలో' సినిమాలో హీరోయిన్ కల్యాణి ఫోన్ నంబర్ తాను వాడుతున్న నంబర్ ఒకటే కావడంతో పలువురు అభిమానులు ఫోన్ చేసి, 'కల్యాణివేనా? ఏం చేస్తున్నావ్?' అంటూ విసిగిస్తున్నారని వాపోయాడు.మొదట ఈ నెంబర్ ఎవరిదో అని ఆరా తీయగా అన్నపూర్ణ ప్రొడక్షన్ లో నాగార్జున నిర్మించిన హలో సినిమాలో తన నెంబర్ వాడారని తెలుసుకొని కోర్టుకెక్కినట్లు తెలిపాడు.అయితే ఈ విషయంపై నాగార్జున స్పందిస్తూ.. టెలికం ఆపరేటర్ అనుమతి తీసుకున్నాకే ఆ నెంబర్ ను సినిమాలో వాడుకున్నామని ఇలా జరుగుతుందని ఊహించలేదని నాగ్ తెలిపారు. అసలే హలో, రంగుల రాట్నం సినిమాలు మిగిల్చిన నష్టాల్లో ఉన్న నాగార్జునకు ఇదో పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక