ఏజెంట్లు మోసం: హైదరాబాద్ చేరుకున్న మలేసియా బాధితులు
- January 25, 2018_1516870100.jpg)
ఏజెంట్లు మోసం చేయడంతో మలేసియాలో చిక్కుకుపోయిన ముగ్గురు హైదరాబాద్ యువకులు తిరిగి సురక్షితంగా నగరం చేరుకున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశం ఉందని చెప్పడంతో కార్వాన్ నటరాజ్ నగర్‌కు చెందిన బిలాల్, ఇబ్రహీం, మతీన్ అలీలు కౌలాలంపూర్ వెళ్లారు. భారీగా డబ్బులు చెల్లించారు. కానీ అక్కడ ఒక స్టీల్ ఫ్యాక్టరీలో బరువులు మోసే పనికి పెట్టడంతో ఇబ్బందులుపడ్డారు.
కంపెనీ వారు పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవడంతో తిరిగి ఇండియా రాలేకపోయారు. తమను ఆదుకోవాలంటూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో స్పందించిన సుష్మ కౌలాలంపూర్ ఎంబసీ అధికారులతో మాట్లాడి యువకులు తిరిగి హైదరాబాద్ వచ్చే ఏర్పాట్లు చేశారు. దీంతో నెల తర్వాత తిరిగి నగరానికి చేరుకున్నారు. మంత్రి సుష్మాస్వరాజ్, మలేసియా ఎంబసీకి ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక