భారత్ ను సంభ్రమాశ్చర్యాలలో ముంచిన సుల్తాన్

- January 25, 2018 , by Maagulf
భారత్ ను సంభ్రమాశ్చర్యాలలో ముంచిన సుల్తాన్

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరంటే ఆ హంగామా, దర్పం వేరు. వాళ్లు మనలా కార్లు, విమానాలను నడుపుకుంటూ రావడం జరిగే పనికాదు. వారు వచ్చారంటే వారి పరివారం..ఆ హడావిడే వేరు. అయితే ఇలాంటి సీన్‌ ఈ వీవీఐపీ విషయంలో మాత్రం రివర్స్‌ అయింది. భారత రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన బ్రూనై సుల్తాన్‌ హసనై బొకీ తన జంబో జెట్‌ను డ్రైవ్‌ చేసుకుంటూ నేరుగా ఢిల్లీలో ల్యాండవడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అధికారగణం సంబ్రమాశ్చర్యాల్లో మునిగితేలింది. ఆయనను కాక్‌పిట్‌లో చూసిన వారంతా విస్తుపోయారు.

2014లో మోదీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన అనంతరం బ్రూనై సుల్తాన్‌ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. ఇతర దక్షిణాసియా దేశాల మాదిరిగా బ్రూనై వార్తల్లో నిలవకపోయినా 71 ఏళ్ల సుల్తాన్‌ చేసిన ఈ ఫీట్‌తో ఆ దేశం హైలైట్‌ అయిందని అధికారులు చెప్పుకుంటున్నారు. 2008, 2012లో సుల్తాన్‌ భారత్‌ పర్యటనకు వచ్చినప్పుడూ తన విమానాలకు ఆయనే కెప్టెన్‌గా వ్యహరించారని అధికారులు గుర్తుచేసుకున్నారు. విదేశీ పర్యటనల సందర్బంగా సుల్తాన్‌ తన 747-700 ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఆయనే పైలెట్‌గా వ్యవహరిస్తారు. గత ఏడాది అక్టోబర్‌ 5తో ఆయన అయిదు దశాబ్దాల సుదీర్ఘ అధికార ప్రస్ధానం పూర్తిచేసుకోవడం గమనార్హం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com