గణతంత్ర వేడుకలకు అందుకే రాలేక పోతున్నా..! : ఏపీ సీఎం

- January 26, 2018 , by Maagulf
గణతంత్ర వేడుకలకు అందుకే రాలేక పోతున్నా..! : ఏపీ సీఎం

ఈ రోజు దేశ వ్యాప్తంగా 69వ గణతంత్ర వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభసమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమరవీరులను, త్యాగమూర్తులను స్మరించుకుందామన్నారు
ఆ మహనీయుల ఆశయాల సాధనకు మనందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కాగా, విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాలు నిర్వహిస్తోంది. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాలేకపోతున్నారు. నిన్న దావోస్ నుంచి బయల్దేరిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 7 గంటలకు అమరావతి రావాల్సి ఉంది.
అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆలస్యమైంది. ఈ కారణంగా ఆయన 69వ గణతంత్ర వేడుకలకు హాజరు కాలేక పోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అబుదాబిలో చంద్రబాబు ఈరోజు సాయంత్రం 4 గంటలకు అమరావతి చేరుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో 69వ గణతంత్ర దినోత్సవం పాల్గొన్న తెలుగు రాష్ట్రాల గవర్నర్ గౌరవ వందనాలు స్వీకరించారు. బాధ్యత గల పౌరులుగా మనందరం సమిష్టిగా శ్రమించాలన్నారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ సాధన లక్ష్యంతో అహర్నిశం, అనుక్షణం కృషి చేద్దామని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com