మహేష్ 'భరత్ అనే నేను' ఫస్ట్ లుక్ అధిరింది..!

- January 26, 2018 , by Maagulf
మహేష్ 'భరత్ అనే నేను' ఫస్ట్ లుక్ అధిరింది..!

టాలీవుడ్ మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'భరత్ అనే నేను' ఫస్ట్ లుక్ వచ్చింది. కోరటాల శివ-మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'శ్రీమంతుడు' సినిమా తర్వాత మహేష్ బాబు టైమ్ అస్సలు బాగా లేదనే చెప్పాలి. బ్రహ్మోత్సవం, స్పైడర్ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయాయి. దీంతో తనకు మంచి సక్సెస్ ఇచ్చిన కొరటాలతో 'భరత్ అనే నేను' లాంటి పొలిటికల్ డ్రామాతో మరోసారి అభిమానుల ముందుకు వస్తున్నారు మహేష్ బాబు.
శ్రీమంతుడు తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రోజు ఉదయం స్వాతంత్ర్యం కోసం జరిపిన దండ యాత్ర తరహాలో ఒక సమూహం కలిసికట్టుగా నడవటాన్ని పోస్టర్ ద్వారా చూపిస్తూ మహేష్ ప్రమాణ స్వీకారంకి సంబంధించి ఓ లిరికల్ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో మహేష్ అభిమానులలో ఆనందం కలుగ జేసినప్పటికి, మహేష్ లుక్ ఎలా ఉంటుందో అనే ఆతృత అభిమానులలో నెలకొంది..ఆ కోరిక కూడా తీర్చేశారు చిత్ర బృందం.
ఈ నేపధ్యంలో చిత్ర టైటిల్‌తో పాటు మహేష్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. క్లాస్ లుక్‌లో బ్రీఫ్ కేసు పట్టుకొని నడుస్తున్న మహేష్ ని చూసి యంగ్ అండ్ స్టైలిష్ ముఖ్యమంత్రి అంటూ తన అభిమాన నటుడిని పొగిడేస్తున్నారు. ఇక ఈ పోస్టర్ బ్యాగ్రౌండ్‌లో డా. బి. ఆర్ అంబేడ్కర్, మహాత్మాగాంధీ ఫోటోలు ఉండటం ఈ ఫస్ట్‌లుక్‌కి హైలైట్‌గా నిలిచాయి.
ముఖ్యమంత్రి ఛాంబర్‌తో ఉన్న బ్యాక్‌ గ్రౌండ్‌ థీమ్‌ కూడా బాగుంది. ఇక ఇంతకాలం ఊరిస్తూ వస్తూ... మేకర్లు ఇప్పుడు ఒక్కోక్కటిగా వరుసపెట్టి వదులుతుండటంతో సూపర్‌ స్టార్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం భరత్‌ అను నేను యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com