సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న సీఎం కేసిఆర్

- January 26, 2018 , by Maagulf
సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్న సీఎం కేసిఆర్

ఈ మధ్య కాలంలో  సోషల్ మీడియా వేదికగా ఇతరులను దూషించడం మరీ ఎక్కువైపోయింది.  అయితే ఇకనుంచి ఏమాత్రం ఆలా చేశారా.. జైలు ఊచలు లెక్కబెడతారు. తాజాగా దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సంతకం కూడా చేశారు. సోషల్ మీడియా  ద్వారా సభ్యత మరిచి ఇతరులను దూషించిన, కించపరిచినా జైలుకు వెళ్లాల్సిందే! కేసు నమోదు చేయడానికి కోర్టు అనుమతి తీసుకోవడం వంటి సంప్రదాయాలేమీ పాటించనక్కర్లేదు. పిర్యాదు అందిన వెంటనే పోలీసులు సంబంధిత వ్యక్తిపై  కేసు నమోదు చేస్తారు. 

ఈ మేరకు ఐపీసీ చట్టంలోని సెక్షన్లు 506, 507 కింద పేర్కొన్న నేరాలను కోర్టు అనుమతి లేకుండానే (కాగ్నిజబుల్‌) విచారించదగినవిగా తెలంగాణ   ప్రభుత్వం గుర్తించింది. కాగాఈ ఫైలుపై నిన్న(గురువారం) రాత్రి సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఇకనుంచి ఎవరైనా సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత దూషణలకు దిగితేన వారు ఈ చట్ట ప్రకారం శిక్షార్హులు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు పెడతామని, ఈ మేరకు చట్టం తీసుకొస్తామని సీఎం గతంలో అనేకసార్లు హెచ్చరించారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com