బూతులు తిట్టినందుకు 13 ఏళ్ల బాలుడిని హత్య చేసిన ..16 ఏళ్ల నిందితుడు
- January 26, 2018
దుబాయ్:బడిఈడు పిల్లలలో నేర ప్రవృత్తి విపరీతంగా ప్రబలుతోంది. కలబడటం నుంచి కత్తులతో పొడుచుకొని స్థాయికి చేరుకొన్నారు. యూఏఈలోని దుబాయ్ నగరంలో ఉన్న అల్ ఖ్వసియా ప్రాంతంలో ఇద్దరు బాలుర మధ్య ఏర్పడిన తగాదా హత్యతో ముగిసింది. 16 ఏళ్ల బాలుడు మరో 13 ఏళ్ళ బాలుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఇంటికి సమీపంలో సైకిల్ తొక్కుకొంటున్న13 ఏళ్ళ బాలుడిని పదునైన కత్తిలో గుండెలపై బలంగా పొడిచి పారిపోయాడు. కత్తిపోట్లకు గురైన ఆ బాలుడు ఇంటికి చేరుకునే ప్రయత్నం చేశాడు.విపరీతమైన రక్తస్రావం కావడంతో కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడివున్న బాలుడిని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ బాలుడు మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. ఈ హత్యకు పాల్పడిన 16 ఏళ్ళ బాలుడు పోలీసులకు లొంగిపోయాడు. తనను, తన కుటుంబాన్ని పచ్చి బూతులు తిట్టాడని అందుకే కత్తితో పొడిచానని నిందిత బాలుడు పోలీసులకు చెప్పాడు. అతడ్ని చంపాలనే ఉద్దేశ్యం తనకు లేదని, చనిపోతాడని తాను ఊహించలేదని అన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందిత బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







