ఆర్.జి.వర్మ "జీఎస్టి" రివ్యూ..

- January 27, 2018 , by Maagulf
ఆర్.జి.వర్మ

"గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" సినిమా కాదు, షార్ట్ ఫిల్మ్ కాదు, వెబ్ సిరీస్ కూడా కాదు.ఇది సెక్స్ మీద మియా మాల్కోవా స్వగతం అంటూ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మియా మాల్కోవా నటించిన గాడ్స్ సెక్స్ అండ్ ట్రూత్ వీడియో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది..జనవరి 26 ఉదయమే దీనిని విడుదల చేసిన్నప్పటికీ విక్షకులు ఒక్కసారిగా వెడ్ సైట్ పై పడటంతో ఎవరికీ ఓపెన్ కాలేదు.. అయితే నిన్న సాయంత్రం ఆరు గంటలనుండి అందరికి అందుబాటులోకి వచ్చింది.. దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిన్నప్పటికీ వర్మ వేటికి దడవకుండా తాను తీసిన వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.. ఈ గొడవల వల్ల పబ్లిక్ లో "గాడ్ సెక్స్ & ట్రూత్" పట్ల ఏస్థాయిలో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యిందంటే.. గతవారం రోజులుగా గూగుల్ లో 70% మంది భారతీయులు "మియా మాల్కోవా, గాడ్ సెక్స్ & ట్రూత్" కోసం మాత్రమే సెర్చ్ చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వీడియోకు విపరీతమైన స్పందన లభిస్తోంది. రూ. 150 తో ఇమెయిల్ ఐడి ద్వారా రిజిస్టర్ అయి వీడియో ఓపెన్ చెయ్యాలి..

నటీమణి: మియా మాల్కోవా (25 ఏళ్ళు)
రచన-కాన్సెప్ట్-పిక్చరైజేషన్: రాంగోపాల్ వర్మ
సంగీతం: ఎం.ఎం.క్రీమ్ అలియాస్ కీరవాణి
లొకేషన్: యూరోప్
విడుదల తేదీ: జనవరి 26, 2018
జోనర్: శృంగారం
నిడివి: 19 నిమిషాలు

మన భారతదేశంలో ఇలాంటి వీడియో తీయడానికి అనుమతి లేదు.. కానీ వర్మ తెలివిగా వేరే దేశంలో షూట్ చేశాడు.. అయితే మానవ జీవితంలో శృంగారం కూడా ఓ భాగమే.. అయితే మన సంప్రదాయం ప్రకారం "శృంగారం అంటే బూతు"లా చూస్తుంటారు.. జీవితంలో ఆకలి, దాహం లాగే శృంగారం అనేది కూడా ఒక భావం-అవసరం అయినప్పుడు దాని గురించి మాట్లాడుకోవడానికి ఎందుకు సంకోచిస్తారు అనే విషయం ఇప్పటికీ చాలామందికి అర్ధం కాదు.. పిల్లల్లో సెక్స్ పట్ల అవగాహన లేక దేశంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని వర్మ అంటున్నాడు.. అందుకని ఒక అమ్మాయి నగ్న సౌందర్యాన్ని ఎంత అందంగా చూపించవచ్చు అనే విషయాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని చూపించాడు.. విపరీత కట్టుబాట్ల సమాజం, ఒక పద్ధతి ప్రకారం అణచిపెట్టిన ప్రకృతిపరమైన స్వేఛ్చాలోచనల్ని బహిరంగ పరచడమే ఈ "గాడ్, సెక్స్ అండ్ ట్రూత్" యొక్క ముఖ్య ఉద్దేశ్యం..

ఇక ఈ వీడియో గురించి చెప్పాలి అంటే..

మియా మాల్కోవా తన శరీరాన్ని చాలా చక్కగా కెమెరా ముందు పెట్టింది.. ఒంపులు తిరుగుతూ తనలోని ఆవేశాన్ని మొత్తం బయటపెట్టింది.. తన శరీరం లోని ప్రతి అంగుళాన్ని వదలకుండా వర్మ చూపించాడు.. వీడియో స్టార్టింగ్ అయ్యే ముందు మ్యూజిక్ తో స్టార్ట్ అయి మియా తన విశ్వ రూపాన్ని చూపిస్తోంది.. అయితే వర్మ దీనిని ఎంత మంచిగా తెరకెక్కిసాడో అని అందరు అనుకున్నారు.. కానీ అచ్చం పోర్న్ వెబ్ సైట్ లలో కనిపించే వీడియో లాగానే ఉంది.. దింతో వీక్షకులు నిరాశ చెందినట్లుగా అర్ధమవుతుంది.. వర్మ ఎదో చూపిస్తాడు అనుకుంటే పోర్న్ వీడియో చూపించాడని అనుకుంటున్నారు ఈ వీడియో చుసిన వారు.. అయితే ఇదేమీ పోర్న్ మూవీ కాదు, ఏదో ఉంటుందని, మియా మాల్కోవా నగ్నదేహాన్ని ఆస్వాదించేద్దామనే ఆలోచనలతో ఈ "గాడ్ సెక్స్ & ట్రూత్"ను చూస్తే మాత్రం మామూలు నిరాశకు లోనవ్వరు. సో, ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే.. మియా మాల్కోవా దేహాన్ని, ఆమె ఫ్లెక్సిబిలిటీని పూర్తి స్థాయిలో యూటిలైజ్ చేసుకొని ఆమె అంగంగాన్ని వీలైనంతగా వర్ణించిన చిత్రమే "గాడ్ సెక్స్ & ట్రూత్".. ఏది ఏమైతే ఏంటి పబ్లిసిటీ ఫుల్ గా వచ్చిపడింది.. దింతో ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com