జనసేన పార్టీ లోకి హీరో శ్రీకాంత్

- January 28, 2018 , by Maagulf
జనసేన పార్టీ లోకి హీరో శ్రీకాంత్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పర్యటనల వల్ల రెండు తెలుగు రాష్ట్రాల లో జనసేన పార్టీ కీలకమైన రాజకీయ పార్టీగా దూసుకుపోతోంది. బలమైన పునాది జనసేన పార్టీకి లేకపోయినా పవన్ కళ్యాణ్ తన చరిష్మాతో పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. 2014 ఎన్నికలలో పోటీ చేయకపోయినా తన మద్దతు తెలిపి ఆయా పార్టీలు అధికారంలో రావడానికి క్రియాశీలకంగా మారారు.

అయితే వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికలలో మాత్రం నేరుగా ఎన్నికల బరిలో ధీగాలనే ఉద్దేశంతో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా రాజకీయాలు చేస్తున్నారు. అయితే జనసేన పార్టీలోకి తెలుగు హీరోలు కొంతమంది జాయిన్ అవుతున్నారని వారి రాకకు పవన్ కళ్యాణ్ కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం.

అయితే తాజాగా ఓ ప్రముఖ తెలుగు హీరో పవన్ కళ్యాణ్ పార్టీ లోకి రావడానికి తెగ ఆరాటపడుతున్నారు అట అయితే ఆ హీరో చిరంజీవికి వీరాభిమాని అంతేకాదు, సేవా భావం కలిగిన వ్యక్తి కూడా ఆయన ఎవరో కాదు హీరో "శ్రీకాంత్". శ్రీకాంత్ జనసేన లోకి వస్తున్నారు అనే ప్రచారం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అయ్యింది.

ఒకానొక టైం లో పవన్ కళ్యాణ్ శ్రీకాంత్ నాకు అన్నలాంటి వాడని శ్రీకాంత్ హీరోగా నటించిన ఓ సినిమా ఆడియో వేడుకలో చెప్పడం జరిగింది పవన్. ఒకవేళ శ్రీకాంత్ పార్టీలోకి వస్తే ఎటువంటి పదవి కట్టబెడతాడో పవన్ కళ్యాణ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com