'మార్తాండ వర్మ' షురూ

- January 29, 2018 , by Maagulf
'మార్తాండ వర్మ' షురూ

హీరో దగ్గుబాటి రానా ఓ బయోపిక్ కు సైన్ చేశాడు. 'మహారాజ మార్తాండ వర్మ'గా ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ట్రావెన్‌కోర్‌ రాజు మార్తాండ వర్మ జీవిత కథ ఆధారంగా తీయనున్న చిత్రంలో టైటిల్‌ పాత్రను పోషించనున్నాడు. 1729-1758 వరకూ ట్రావెన్‌కోర్‌ను పాలించిన రాజుగా రానా కన్పించనున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కె.మధు మాట్లాడుతూ. తిరువనంతపురం ఆలయంలో ఇంతకుముందు నేను రానా కలిసాం. ఈచిత్రం చేయాలనే ఆలోచన ఆరోజే మొదలైంది. అందుకని ఈచిత్రాన్ని ఇక్కడే తొలుత మొదలు పెట్టాం" అని తెలిపారు.

ఇదీలావుంటే.. రానా '1945' చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సత్య శివ తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com