ట్విట్టర్ కు వార్నింగ్ ఇచ్చిన బిగ్ బీ
- February 01, 2018
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ ప్రకటన సినిమాలకు సంబంధించి కాదులెండి. ట్విట్టర్ ఖాతా నుంచి.. కారణం ఏంటంటే ఆయన ఫాలోవర్ల సంఖ్యను ట్విట్టర్ తగ్గించని అమితాబ్ అభిప్రాయపడుతున్నారు. బుధవారం రాత్రి ఆయన ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశారు.
''ట్విట్టర్.. నా ఫాలోవర్ల సంఖ్యను తగ్గించేశావు. ఇది జోక్‌గా ఉంది(నవ్వుతూ).. నీ నుంచి తప్పుకోవాల్సిన టైమ్ వచ్చేసింది. ఇంకా చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. చాలా ఎక్సైటింగ్ విషయాలున్నాయి. అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. నిన్న మొన్నటి వరకూ అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీ అమితాబే.. తాజాగా ఆ స్థానాన్ని షారుఖ్ ఖాన్ కొట్టేశాడు. ఆయన ట్వీట్‌లో ట్విట్టరే తన ఖాతాదారులను తగ్గించనట్లుంది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి తోడుగా ఓ పిక్‌ని కూడా పోస్ట్ చేశారు. తను నటించిన ఓ సినిమాలో విలన్ గొంతు పట్టుకున్న స్టిల్‌ని పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు