మెయిడ్‌ హత్య: తల్లి, కుమార్తెకి జైలు

- February 03, 2018 , by Maagulf
మెయిడ్‌ హత్య: తల్లి, కుమార్తెకి జైలు

యు.ఏ.ఈ:కల్బా క్రిమినల్‌ కోర్టు, గల్ఫ్‌ జాతీయురాలైన తల్లి, ఆమె కుమార్తెకు ఏడాది, ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష అనంతరం వీరిని దేశం నుంచి బహిష్కరిస్తారు. తమ దగ్గర పనిచేస్తున్న మెయిడ్‌ని చిత్ర హింసలు పెట్టి, ఆమె మృతికి కారణమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిపై కేసు నమోదయ్యింది. నిందితుల భర్త, మెయిడ్‌కి స్పాన్సరర్‌. అతనికీ 3,000 దిర్హామ్‌ జరీమానా విధించింది న్యాయస్థానం. ఏడాదిన్నరపాటు ఈ కేసు విచారణ జరిగింది. మృతురాలి కుటుంబం, నిందితులకు క్షమాభిక్ష పెట్టారు, బ్లడ్‌ మనీని అంగీకరించారు. కొన్నాళ్ళ క్రితం ఈ కేసు వెలుగు చూసింది. అంబులెన్స్‌ సాయం కోసం పోలీసులకు సమాచారం అందగా, అక్కడికి చేరుకున్న అంబులెన్స్‌ సిబ్బందికి అక్కడ ఆమె చనిపోయినట్లు తెలిసింది. ఆమె శరీరంపై తీవ్రగాయాలున్నట్లు సిబ్బంది గుర్తించి, అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. విచారణలో, ఆమెపై విచక్షణా రహితంగా దాడి జరిగినట్లు తేలింది. అయితే స్పాన్సరర్‌ కుటుంబ సభ్యులు, వేధింపుల ఆరోపణల్ని కొట్టి పారేశారు. విచారణలో మాత్రం దాడి జరిగిందని నిరూపితం కావడంతో, నిందితులపై న్యాయస్థానం కఠిన చర్యలకు ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com