బాలకృష్ణ రైట్ షోల్డర్ ట్రీట్మెంట్
- February 03, 2018
గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రీకరణ సమయంలో గాయంరాయదుర్గం,న్యూస్‌టుడే: సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ కుడి భుజానికి శనివారం హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ కాంటినెంటల్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా చిత్రీకరణ సమయంలో ఆయన గాయపడ్డారు. అప్పట్లో ప్రథమ చికిత్స చేయించుకున్నారు. అప్పట్నుంచి భుజం నొప్పి సమస్యతో (రొటేటర్ కప్ టియర్స్ ఆఫ్ షోల్డర్) బాధపడుతున్నారు. జైసింహా సినిమా చిత్రీకరణలో తీరిక లేకుండా ఉన్న ఆయన జనవరిలో వైద్యులను సంప్రదించారు. మందులతో నొప్పి తగ్గకపోవడంతో శనివారం ఉదయం బాలకృష్ణ ఆసుపత్రిలో చేరారు. ఆర్థోపెడిక్ సర్జన్ దీప్తి నందన్‌రెడ్డి, ఆశిష్ బాబుల్కర్(పుణే) ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. 'చికిత్స విజయవంతమైందని, మూడు రోజుల పాటు ఆయన ఆసుపత్రిలో ఉంటారని' వైద్యులు వెల్లడించారు
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు