మంచు హీరో కోసం బాహుబలి రచయిత సీనియర్‌ కేవీ విజయేంద్ర ప్రసాద్‌

- February 03, 2018 , by Maagulf
మంచు హీరో కోసం బాహుబలి  రచయిత సీనియర్‌ కేవీ విజయేంద్ర ప్రసాద్‌

సినిమా : సీనియర్‌ రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్‌ అందించే కథలు చాలా వరకు బ్లాక్‌ బస్టర్లు అవుతాయనే నమ్మకం చిత్ర పరిశ్రమలో ఉంది. ముఖ్యంగా బాహుబలి, భజిరంగీ భాయ్‌జాన్‌లతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. అందుకే భాషలకతీతంగా దర్శకులు ఆయన కథ కోసం ఎగబడిపోతుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ లో మరో యువ హీరో కోసం ఆయన కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

‘‘మంచు విష్ణు కోసం ఆయన ఓ కథను సిద్ధం చేశారు. పక్కా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో సోషల్‌ డ్రామాగా అది ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో స్క్రిప్టును పక్కాగా హ్యాండిల్‌ చేయగలిగే సత్తా ఉన్న దర్శకుడి కోసం విష్ణు వేటను ప్రారంభించేశాడు. ఇప్పటికే ఇద్దరు యంగ్‌ డైరెక్టర్లను పేర్లను విష్ణు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది’’ అన్నది ఆ కథనం సారాంశం. 

అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లోనే చిత్రం సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు విష్ణు నటించిన రెండు చిత్రాలు ఆచారి అమెరికా యాత్ర, గాయత్రి విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com