ట్రిపుల్ ధమాకా తో అక్కినేని వారి కోడలు సమంత

- February 03, 2018 , by Maagulf
ట్రిపుల్ ధమాకా తో అక్కినేని వారి కోడలు సమంత

అక్కినేని వారి కోడలు సమంత ఈసారి ప్రేక్షకులకు ట్రిపుల్ ధమాకా ఇవ్వబోతుంది. సమంత నటించిన మూడు సినిమాలు.. ఒక్క రోజు గ్యాప్‌లో విడుదలకు ముస్తాబవుతున్నాయి.

విశాల్-సమంత హీరో హీరోయిన్స్‌గా తమిళంలో రూపొందిన 'ఇరుంబు తిరై' తెలుగులో 'అభిమన్యుడు'గా అనువాదమయ్యింది. పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా అలరించబోతున్నాడు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా సంక్రాంత్రికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాలతో ఈ చిత్రాన్ని రెండు భాషల్లోనూ పోస్ట్ పోన్ చేశారు. తాజాగా ఈ సినిమా న్యూ రిలీజ్ డేట్ ప్రకటించాడు ప్రొడ్యూసర్ కమ్ హీరో విశాల్. ఈ చిత్రాన్ని మార్చి 29న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

మార్చి 29నే సమంత నటిస్తోన్న సావిత్రి బయోపిక్ 'మహానటి' కూడా విడుదల కానుంది. ఇక మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌తో మొదటిసారి సామ్ నటిస్తోన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ 'రంగస్థలం-1985' మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సమంత నటిస్తోన్న మూడు సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌లో ఆడియెన్స్‌ను అలరించబోతున్నాయన్నమాట. మరి ఈ మూడు చిత్రాలతో అక్కినేని వారి కోడలు ఎలాంటి విజయాలను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com