ఓ యువతి నడి రోడ్డు పై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో వీరంగం
- February 10, 2018సిటీలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు... మందుబాబులు చుక్కలు చూపిస్తున్నారు. మందేసి రోడ్డెక్కిందే కాకుండా... ఖాకీలతో గొడవ పడుతున్నారు. మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్లు దూషిస్తూ... పోలీసుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. నిన్న అర్ధరాత్రి కూడా చాలాచోట్ల ట్రాఫిక్ సిబ్బందితో మందుబాబులు ఆటాడుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌కు సహకరించకుండా... మద్యం మత్తులో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు.
మరోవైపు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌లో ఢిల్లీకి చెందిన ఓ యువతి వీరంగం సృష్టించింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై విరుచుకుపడింది. మీ సంగతి చూస్తానంటూ... కెమెరాలను లాక్కొనేందుకు ప్రయత్నించింది. ఆమెతో ఉన్నవారు వారిస్తున్నా వినిపించుకోకుండా... మీడియా ప్రతినిధులపైకి దూసుకొచ్చి నానా రభస చేసింది.
నిన్న రాత్రి నగరంలో ఏడు ప్రాంతాల్లో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 39 మందిపై కేసులు నమోదు చేసి... వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు