భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కామన్వెల్త్ క్రీడలకు దూరం
- February 13, 2018
దిల్లీ: భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కామన్వెల్త్ క్రీడలకు దూరం కానుంది. మోకాలి గాయంతో బాధపడుతున్న ఆమె గత కొంతకాలంగా పోటీలకు దూరంగా ఉంది. ఈ గాయం ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేకపోవడంతో ఈ ఏప్రిల్ 4 నుంచి 15 వరకు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడలకు దీప దూరం అవుతున్నట్లు ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది తెలిపాడు. ''కామన్వెల్త్ క్రీడల్లాంటి మెగా ఈవెంట్లో పోటీపడటానికి దీప ప్రస్తుతం సిద్ధంగా లేదు. ఆగస్టు 18న ప్రారంభమయ్యే ఆసియా క్రీడల సమయానికి ఆమె అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి ఆమె ఫిట్‌గానే ఉంది. కానీ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా లేదు. ఆమె కెరీర్‌కు ఇదేమీ అడ్డంకి కాదు. త్వరలోనే కోలుకుని బరిలో దిగుతుంది'' అని దీప చెప్పింది. రియో ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి దీప నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
2014 కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి