పిఎసిడిఎ అలర్ట్: ఒమన్‌లో వర్ష సూచన
- February 25, 2018
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ), సుల్తానేట్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. లో ప్రెజర్, వర్షాల కారణంగా సుల్తానేట్‌లోని పలు ప్రాంతాలు కొంత మేర ఎఫెక్ట్ అయ్యే అవకాశాలున్నట్లు పేర్కొంది. ఒమన్ నార్తరన్ ప్రాంతం ముందుగా వర్షాల్ని చవిచూస్తోంది. ముసాందామ్లో ఆదివారం వర్షం కురిసింది. దిబ్బా, బుఖా, బురైమి మరియు మధా కూడా చిరుజల్లులతో తడిసి ముద్దయ్యాయి. ఆదివారం నుంచి ఓ వారం రోజులపాటు ఒమన్‌లో చాలా చోట్ల వాతావరణం ఇలాగే ఉండొచ్చు. ఐసోలేటెడ్ రెయిన్, అకేషనల్ థండర్ షవర్స్తోపాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, లోతట్టు ప్రాంతాల్లోనివారు అప్రమత్తంగా ఉండాలనీ, అటువైపు వెళ్ళే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పిఎసిడిఎ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







