కువైట్ లో ప్రేక్షకులని అలరిస్తున్న ప్రపంచంలోని అతి పెద్ద 16 వ అల్ఫార్సి గాలిపటాల ఉత్సవం

- February 26, 2018 , by Maagulf
కువైట్ లో ప్రేక్షకులని అలరిస్తున్న  ప్రపంచంలోని అతి పెద్ద 16 వ అల్ఫార్సి గాలిపటాల ఉత్సవం

కువైట్ : కువైట్  జాతీయ దినోత్సవ వేడుకలో భాగంగా, అల్ఫర్సి అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం కువైట్ లోని  పలువురిని ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని అతి పెద్ద గాలిపటాల ప్రదర్శనకు వేదికగా నిలుస్తుంది. కువైట్ లో ప్రదర్శించబడింది. అల్ఫర్స్సి కైట్ క్లబ్ నిర్వహిస్తున్న ఈ గాలిపటాల ఉత్సవంకు కు 11 కి పైగా దేశాల నుండి కైట్ జట్లు హాజరయ్యాయి. 1200 చదరపు అడుగుల పొడవైన గాలిపటం ఆల్ఫర్సి క్లబ్ చేత ఎగురవేయబడింది, కువైట్ 1050 చదరపు అడుగుల గాలిపటం ప్రస్తుత రికార్డును నమోదు చేసింది . ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, తదితర అనేక దేశాల జట్లు ఈ గాలిపటాల పండుగలో పాల్గొన్నాయి. ఒక భారీ గాలిపటం భూమికి అంకితం చేయబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద గాలిపటం, హిందీతో సహా తొమ్మిది అంతర్జాతీయ భాషల్లో వ్రాయబడిన సందేశాన్ని ఆ గాలిపటంపై ముద్రించారు. ఈ పండుగను ఆల్ఫార్సీ కైట్ బృందం అధ్యక్షుడు అబ్దుల్రాహ్మాన్ షైఖన్ అల్-పార్సీ ప్రారంభించారు. ఫిబ్రవరి 25 ఆదివారం ప్రారంభమై 26 వ తేదీ సోమవారం నాడు ముగిస్తుంది. రెండు రోజులపాటు ఈ గాలిపటాల పండుగకు పౌరులు  మరియు ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com