శ్రీకాకుళం జిల్లా లో భారీ అగ్ని ప్రమాదం: 18 ఇళ్ళు దగ్దం

- November 28, 2015 , by Maagulf
శ్రీకాకుళం జిల్లా లో భారీ అగ్ని ప్రమాదం: 18 ఇళ్ళు దగ్దం

గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 18 ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తురకపేట గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తూ గ్యాస్ లీక్ అవడంతో మంటలు ఎగసిపడ్డాయి. మంటలకు గాలి తోడవడంతో.. 18 ఇళ్లు కాలిపోయాయి. ఇది గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదంలో సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానికులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com