జె-వాకింగ్: 50,000 మందికి జరీమానా
- March 03, 2018
50,700 మంది దుబాయ్ రెసిడెంట్స్‌కి జె-వాకింగ్ నేపథ్యంలో జరీమానా విధించారు గత ఏడాది. పోలీసులు ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. జె-వాకింగ్ 21 శాతం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. జె-వాకింగ్ అంటే, నిర్దేశిత ప్రాంతాల్లో కాకుండా రోడ్లపై ఎక్కడికక్కడ నడుస్తూ క్రాస్ చేయడం. దీన్ని తప్పిదంగా గుర్తిస్తూ, అక్కడికక్కడ 400 దిర్హామ్‌ల జరీమానా విధించడం జరుగుతోంది. రోడ్లపై నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే దాటాల్సి ఉంటుంది పాదచారులు. అలా కాకుండా ఎక్కడబడితే అక్కడ రోడ్డుని నడిచేవారు క్రాస్ చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా జరిగే మరణాల్ని తగ్గించడమే లక్ష్యంగా జె-వాకింగ్కి జరీమానాలు విధిస్తున్నారు. జరీమానాలతో జె-వాకింగ్ తగ్గిందనీ, మరణాల సంఖ్య కూడా 21 శాతం వరకు తగ్గిందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







