రజినీకాంత్ 2.0 టీజర్ లీక్..
- March 04, 2018
రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ నటించిన 2.0 టీజర్ ఆన్ లైన్ లో లీక్ అయ్యింది. ఆదివారం ట్విట్టర్ ఈ వీడియో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని మరల్చింది. భారతీయ చలన చిత్ర రంగ సంస్థ ట్రాకర్ రమేష్ బాల అధికారిక విడుదలకు ముందే టీజర్ లీక్ కావడం విస్మయానికి గురిచేసిందని ట్వీట్ చేశాడు.
కాగా.. రజనీతో పాటు బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన కొన్ని సీన్లతో, డైలాగులతో కూడిన వీడియోను ఎవరో విడుదల చేశారు. ఇదే 'టీజర్ లీక్' అంటూ '2.0'లోని కొన్ని సన్నివేశాలను ఈ ఉదయం విడుదలకావడంతో చిత్ర యూనిట్ కి షాక్ తగిలింది. ఇక ఈ సినిమా సీన్లు యూట్యూబ్ తదితర సోషల్ మీడియా ఛానళ్లలో వైరల్ అవుతుండటంతో, నిర్మాతల ఫిర్యాదు మేరకు వాటన్నింటినీ యూట్యూబ్ తొలగించింది. చాలా లింక్స్ లో ఈ వీడియో రాకపోయినా, అప్పటికే డౌన్ లోడ్ చేసుకున్న వందలాది మంది తిరిగి పోస్టులు చేస్తున్నారు. దీని వెనక ఉన్న మోసగాళ్లను పట్టుకోవాలని చిత్ర యూనిట్ పోలీసులను కోరింది.
శంకర్ దర్శకత్వం వహించిన రోబో సినిమాకు సీక్వెల్ ఈ 2.0 మూవీ. 2.0 తమిళంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటించడం ఇదే తొలిసారి. రజినీకాంత్ తో కలిసి నటించడం కూడా ఇదే అక్షయ్ కు మొదటిసారి. ఈ చిత్రంలో ఆదిల్ హుస్సేన్, సుధాన్షు పాండే కూడా నటించారు. చిత్ర నిర్మాతలు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కొన్ని వారాల క్రితం దుబాయిలో ఘనంగా ఫంక్షన్ నిర్వహించి ఆడియోను విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సినిమా అంచనా బడ్జెట్ రూ. 400 కోట్లు దాటిపోయింది. భారతదేశం ఇప్పటివరకు చేసిన అత్యంత ఖరీదైన చిత్రాలలో ఇది ఒకటి. అకాడమీ అవార్డు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రహమ్మన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా..నిరవ్ షా సినిమాటోగ్రఫర్.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







