నాగ అన్వేష్ కొత్త మూవీ ప్రారంభం
- March 04, 2018
యువ కథానాయకుడు నాగ అన్వేష్ నటిస్తున్న కొత్త చిత్రం ఏ నిమిషానికి ఏమి జరుగునో ప్రారంభోత్సవం జరుపుకుంది. గణష్ క్రియేషన్స్ పతాకంపై లండన్ గణేష్, సీహెచ్వీ నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీకృష్ణ గొర్లె ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. హైదరాబాద్ రామానాయుడు స్డూడియోలో ఏ నిమిషానికి ఏమి జరుగునో చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్త సన్నివేశం అనంతరం నిర్మాత లండన్ గణేష్ మాట్లాడుతూ.లండన్ నివాసిని కాబట్టి లండన్ గణష్ అంటారు. డిసెంబర్లో ఈ సినిమా బృందాన్ని కలిశాను. మా దర్శకుడు మంచి కథతో సినిమా చేయబోతున్నారు. కొత్త తరహా చిత్రమవుతుందని ఆశిస్తున్నాం. అన్నారు. దర్శకుడు శ్రీకృష్ణ గొర్లె మాట్లాడుతూ.సైన్స్ ఫిక్షన్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఆదిత్య 369, పుష్పక విమానం తరహాలో ఉంటుంది. మూడు పాటలుంటాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం. అన్నారు. కథానాయకుడు నాగ అన్వేష్ మాట్లాడుతూ.చాలా కొత్త తరహా కథ. ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ముగింపు వరకు ఏ జరుగుతుందో కథ విన్న నాకే అర్థం కాలేదు. ప్రేక్షకులను ఆకట్టుకునే చిత్రమవుతుంది. ముహూర్తం బాగుందని చిత్రాన్ని ప్రారంభించాం. వచ్చే నెల చిత్రీకరణ ఉంటుంది. అన్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







