'మిస్ తెలంగాణా 2018' గ్రాండ్ ఫినాలే మార్చి 8న

- March 04, 2018 , by Maagulf

హైదరాబాద్:అందం,అంతకుమించిన అత్మవిశ్వాసం ఉన్న అమ్మాయిలు అయతే చాలు వారి ప్రతిభను  వేల్లదిచేసుకునేందుకు తగిన అవకాశం తాము కల్పిస్తామంటు ఆర్ కే మీడియా ప్రమోషన్స్ మరియు ఎజె ఎవేన్చర్స్ సంయుక్తoగా ‘మిస్ తెలంగాణా 2018’ పోటీలను నిర్వహిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న పలు దశల పోటీల తరువాత 27 మంది అమ్మాయిలను ఫైనల్స్ కు ఎంపిక చేశారు.నేడు బంజరహిల్ల్స్ లోని లఖోటియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ లో జరిగిన కార్యకమంలో వీరిని మీడియాకు పరిచయం చేశారు.

ఈ సందర్బంగా నిర్వాహకులు రవి పనస (ఆర్ కే మీడియా c.e.o), అనిత (ఎజె ఎవేన్చర్స్), జనార్దన చల్లా, మరియు గౌతం (హబిబ్స్) మాట్లడుతూ “ ఈ పోటీలకు అపూర్వమైన స్పందన వచ్చిoది.ఎక్కువ మంది అమ్మాయిలు రావడంతో రెండు సార్లు ఆడిషన్స్ నిర్వహించాం.వారిలో నుంచి ఈ 27 మందిని ఫైనల్స్ కు ఎంపిక చేశాం. వీరందరికీ గ్రూమింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నాం.ర్యాంప్ వాక్ తదితర అంశాలలో శిక్షణ ఇస్తున్నాo. మార్చి 8వ తేదీన సోమాజిగూడలోని ది పార్క్ హోటల్ లో గ్రాండ్ ఫైనల్స్ నిర్వహించబోతున్నాం...’’ అని అన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధాన స్పాన్సర్ లుగా లఖోటియా ఫాషన్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజైన్, హబీబ్ హెయిర్ అండ్ బ్యూటీ,ఫ్లిక్ స్టార్,లాగిన్ మీడియా వ్యవహరిస్తున్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com